సుభాష్‌నగర్: నగరంలోని కలెక్టరేట్‌లోగల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం మెడికల్ ఆఫీసర్లకు డ్రాఫ్టింగ్, పాలనాపరమైన అంశాలపై రిటైర్డ్ జిల్లా కార్మిక అధికారి యోహన్ శిక్షణనిచ్చారు. వైద్యాధికారులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాలనాపరమైన అంశాలు, డ్రాఫ్టింగ్, ప్రొసీడింగ్స్, లెటర్ రైటింగ్, లీవ్స్ రూల్స్, ఆఫీస్ సబార్డినేట్ రూల్స్, మెమో, షోకాజ్ నోటీసు, ఆర్‌టీఐ అంశాలు, కోర్టు కేసులు డీల్ చేయడం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యాధికారుల సందేహాలను నివృత్తి చేశారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ, ఇతక అధికారులు అశోక్, రవీందర్, సమత, సికందర్ నాయక్, సుమంత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


