కందకుర్తిలో ఇసుక అక్రమ నిల్వలు | - | Sakshi
Sakshi News home page

కందకుర్తిలో ఇసుక అక్రమ నిల్వలు

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

కందకుర్తిలో ఇసుక అక్రమ నిల్వలు

రెంజల్‌(బోధన్‌): మండలంలోని కందకుర్తి శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయంలో మంజీరా, హరిద్ర నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను తోడేస్తు సమీపంలోని పంట పొలాల్లో నిల్వ చేస్తున్నారు. రాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వార తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించగా అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను సీజ్‌ చేసి ప్రభుత్వ పనులకు తరలిస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement