మాచారెడ్డి: ఘన్పూర్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రి వైద్యుడు అభినయ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 226 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని మోతి బిందు ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ.. మోతి బిందు ఆపరేషన్ అయిన వారికి మందులతో పాటు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సర్పంచ్ ప్రశాంత్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామి యాదవ్, పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు మహేష్, ప్రవీణ్, నరేష్, సతీష్ సురేష్ కారోబార్ నరేష్, శంకర్ పాల్గొన్నారు.


