బోధన్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని బోధన్ ఆర్డీవో విజయకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో ఆర్డీవో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయని అధికారు లు తెలిపారు. బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న రాకాసీపేట జీహెచ్‌ఎస్ (జేసీ) ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘా ల జేఏసీ ప్రతినిధులు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. వివిధ ప్రభుత్వ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని ఐటీ టవర్‌లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టాస్క్ అధికారి హన్మంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అర్థమెటిక్, రీజనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 29 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు 7013675052 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన స్థానంలో సోమవారం రైతులకు పసుపు నారు(మొక్కలు)ను, అల్లం మొక్కలను పంపిణీ చేశారు. భీమ్‌గల్, మెట్‌పల్లి, జగిత్యాల్, అర్గుల్, గుమ్మిర్యాల్, ఉప్లూర్, పాలెం, నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఒక్కో మొక్కకు రూ. 2 చొప్పున చెల్లించి తీసుకెళ్లారు. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విద్య, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వర్ని: ప్రస్తుత ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా అందుబాటు లో ఉన్నాయని వర్ని ఏవో రాజశేఖర్ వెల్లడించారు. మండలంలోని తగిలేపల్లి సహకార సంఘం గోడౌన్‌లో సోమవారం ఆయన యూరి యా నిల్వలను పరిశీలించారు. మండలంలో ఇప్పటివరకు 21,612 యూరియా బస్తాలు రైతులకు అందజేశామన్నారు. మండలంలో ప్రస్తుత సాగు విస్తీర్ణం 16వేల ఎకరాలు ఉండగా 32వేల యూరియా బస్తాలు కేటాయించబడినట్లు వెల్లడించారు. మిగిలిన యూరియా నిల్వలు ఈ నెలాఖరులోపు మండలంలోని సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మంగళవారం రైతు వేదికలో సీడ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.


