ప్రజావాణికి వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి వినతుల వెల్లువ

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

అదనపు కలెక్టర్‌కు సమస్యను విన్నవిస్తున్న

సీపీఐ(ఎంఎల్‌) నాయకులు

ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న

ఐద్వా ప్రతినిధులు

నవీపేట/నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకేంద్రంలోని క లెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను పేర్కొంటూ అధికారులకు వినతులు సమర్పించారు. నవీపేటలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఉప సర్పంచ్‌ నవీన్‌రాజ్‌, వా ర్డు సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో విద్యు త్‌ మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) నిజామాబాద్‌ నగర కమిటీ ఆ ధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చే యాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధికారుల కు విన్నవించారు. రేషన్‌ షాపుల్లో 14 రకాల సరుకు లు ఇవ్వడంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అడివాల అనిత, నగర కమిటీ సభ్యురాలు శ్రీదేవి, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

జీపీ కార్మికుల నిరసన..

నిజామాబాద్‌అర్బన్‌: గ్రామ పంచాయతీ కార్మికుల కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చే స్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్క ర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరే ట్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణి లో అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్‌, సుధాకర్‌, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement