దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నూతన కార్యవర్గం ఎన్నిక వేలం పాట

తెయూ(డిచ్‌పల్లి): డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్‌ 2026–27 మూడవ విడతకు సంబంధించి ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాలను సోమవారం తెలంగాణ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎన్‌సీసీ 19,స్పోర్ట్స్‌ 10, ది వ్యాంగులు 03, మొత్తం 32 మంది అభ్యర్థులు హా జరైనట్లు తెయూ దోస్త్‌ కోఆర్డినేటర్‌ వాసం చంద్రశేఖర్‌ తెలిపారు. ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్‌ అధికారి రామ స్వామి, తెయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బీఆర్‌ నేత, సిబ్బంది దిలీప్‌, సురేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (జూడాలు) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఈమేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించింది. మాజీ అధ్యక్షుడు కార్తీక్‌ కొమ్మనబోయిన నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు. అధ్యక్షుడిగా ప్రణీత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ప్రణయ్‌, వరప్రసాద్‌ ఎన్నికయ్యారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌ నూతన కార్యవర్గానికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌–1 డిపో కార్గో పార్సిల్‌కు సంబంధించిన అన్‌కై ్లమ్‌డ్‌ పార్సిల్‌, వస్తువులను మంగళవారం వేలం వేయనున్నట్లు డిపో–1 మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ ఒక ప్రకటనలతో తెలిపారు. బస్టాండ్‌లోని కార్గో కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు వేలం పాటల్లో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా పార్శిల్‌ సేవల్లో 30 శాతం తగ్గింపు ఉంటుందని డీఎం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement