ప్రతిభ చాటిన విద్యార్థినులు
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ –మే 2026లో నిర్వహించిన డిగ్రీ 2,4,6వ సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ ఫలితాల్లో అమ్మాయిలు చక్కని ప్రతి భ చూపడం అభినందనీయమన్నారు. 6వ సెమిస్టర్‌లో 4,970 మంది హాజరుకాగా 3,091 మంది ఉత్తీర్ణులయ్యారు.మొత్తం 62.19 శాతం ఉత్తీర్ణత న మోదుకాగా అమ్మాయిలు 70.22 శాతం, అబ్బాయి లు 40.61 శాతం పాసయ్యారు. 4వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 4,427 మంది హాజరుకాగా 1,714 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 38.72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా అమ్మాయిలు 46.51 శాతం, అబ్బాయిలు 18.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2వ సెమిస్టర్‌లో మొత్తం 5,139 మంది హాజరుకాగా 2,000 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 38.92 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా అమ్మాయిలు 49.27 శాతం, అబ్బాయిలు 15.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్స్ నందిని, శాంత తదితరులు పాల్గొన్నారు.


