హెచ్‌ఎంగా, రిసోర్స్‌ పర్సన్‌గా.. | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంగా, రిసోర్స్‌ పర్సన్‌గా..

Jun 22 2026 1:24 AM | Updated on Jun 22 2026 1:24 AM

హెచ్‌ఎంగా, రిసోర్స్‌ పర్సన్‌గా..

సీనియర్‌ ఉపాధ్యాయుడు రాములు చింతలూర్‌ పాఠశాల హెచ్‌ఎంగా ఉంటూ మండల, జిల్లా, రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌గా విద్యా విధానాలు, పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. స్మార్ట్‌ టీవీలు, ప్రొజెక్టర్లు, డిజిటల్‌ కంటెంట్‌, ఏఐ ద్వారా విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యా వీడియోలు, నీతి కథలు, పాటలు, పాఠ్యంశాలను యూట్యూబ్‌ ద్వారా వివరిస్తూ డిజిటల్‌ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సమయ పాలన వంటి అంశాలపై శిక్షణను అందిస్తున్నారు. పాఠశాలలో వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ హరిత ఉపాధ్యాయుడిగా జిల్లాస్థాయి పురస్కారం అందుకున్నారు. విద్యార్థుల అభ్యసనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా తన సేవా కాలమంతా అత్యల్ప సెలవులను మాత్రమే వినియోగిస్తూ అంకిత భావాన్ని చాటుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement