నిత్య సాధనతో ఆరోగ్య యోగం | - | Sakshi
Sakshi News home page

నిత్య సాధనతో ఆరోగ్య యోగం

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

ప్రపంచానికి వరం ‘యోగా’

జిల్లా జడ్జి భారతలక్ష్మి

నిజామాబాద్‌ లీగల్‌ : నిత్య సాధనతో ఆరోగ్య యోగం కలుతుందని జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి భారతలక్ష్మి కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులతో కలిసి యోగా చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధన చేయాలని అన్నారు. యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మంచి ఆరోగ్యంతోపాటు చక్కని జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. శిబిరంలో కోర్టు ఉద్యోగులు సంగీత, న్యాయవాది చౌదరి యోగా గురువులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అదనపు జడ్జీలు నారాయణ, శ్రీనివాస రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలకంఠ రావు, న్యాయవాదులు మాణిక్‌రాజ్‌, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, రషీద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: ప్రపంచానికి మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప వరం ‘యోగా’ అని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు ఆచరించడంతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని కమాండెంట్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌లో కమాండెంట్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ నిజామాబాద్‌ ప్రతినిధులు బెటాలియన్‌ అధికారులు, సిబ్బందితో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, యోగా ఆచరించడం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు డీ శ్రీనివాసరావు, వీ నరసింహస్వామి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement