ఈ సారు.. పాఠాల స్టైలే వేరు | - | Sakshi
Sakshi News home page

ఈ సారు.. పాఠాల స్టైలే వేరు

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

వినూత్న రీతిలో విద్యాబోధన

టీఎల్‌ఎంతో విద్యార్థుల్లో సృజనాత్మకత

ఆదర్శం.. చింతలూర్‌ ఎంపీపీఎస్‌

హెచ్‌ఎం రాములు

జక్రాన్‌పల్లి: పాఠాల బోధన అనేది ఒక కళ. ఏది ప డితే అది, ఎలా పడితే అలా బోధిస్తే విద్యార్థులు స రిగ్గా అర్థం చేసుకోలేరు. అయితే, కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే లా పాఠాల బోధనకు కొన్ని ప్రత్యేక పద్ధతులను పా టిస్తారు. అభ్యసనంపై విద్యార్థులకు ఉత్సాహం కలిగిస్తారు. అలాంటి కోవకే చెందుతారు జక్రాన్‌పల్లి మండలం చింతలూరు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొలాస రాములు. 2021లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రాములుపై ప్రత్యేక కథనం..

ఆటల ద్వారా విద్య..

రాములు సంప్రదాయ బోధనా విధానాలకు భిన్నంగా టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌( టీఎల్‌ఎం)ను స మర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులలో నేర్చుకునే ఆసక్తిని పెంపొందిస్తున్నారు.తరగతి గదిలో వి విధ రకాల నమూనాలు, చార్టులు, చిత్రాలు, కార్యకలాపాల ఆధారిత బోధన సామగ్రిని ఉపయోగించి క్లిష్టమైన అంశాలను కూడా విద్యార్థులకు సుల భంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పాఠాలను కేవలం కంఠస్థం చేయడమే కాకుండా వాటి భావాన్ని లోతుగా గ్రహించే అవకా శం పొందుతున్నారు. ఆటల ద్వారా విద్య, అనుభవాత్మక అభ్యాసం, విద్యార్థుల భాగస్వామ్యంతో కూడిన బోధనా విధానాలతో తరగతి గది విద్యార్థులకు ఆనందదాయకమైన అభ్యాస కేంద్రంగా మారుతోంది.

11 నుంచి 40 మంది విద్యార్థులకు పెంపు...

చింతలూర్‌ పాఠశాలలో గతంలో 11 మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. ఈ సంవత్సరం రాములు, ఉపాధ్యాయ బృందం సహకారంతో 40 మంది విద్యార్థులకు పెంచారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులను చేర్పించారు. సర్పంచ్‌ నాగుల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement