వర్ని: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపడుతున్న సిద్దాపూర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రైతుల కు సాగునీరందించే ప్రాజెక్టు నిర్మాణ పను ల్లో కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులు దగ్గరుండి నిర్మాణ పనులను నాణ్యతతో జరిగే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు తరచూ తాను తనిఖీలు చేస్తానన్నారు. నిజాంసాగర్ కాలువ ఎగువ భాగాన ఉన్న రైతులకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆయనవెంట సర్పంచ్ బాల్‌సింగ్ తదితరులు ఉన్నారు.
పెండింగ్ బిల్లులు
విడుదల చేయండి
ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చ ర్యలు తీసుకోవాల ని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోనిసచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్‌బీ మంత్రి వాకిటి శ్రీహరిని వేర్వేరుగా ఆదివారం కలిసి పలు వినతిపత్రాలు అందజేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని డిప్యూటీ సీఎంకు వివరించా రు. నందిపేట్‌లో క్రీడాభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీహరిని ఎమ్మెల్యే కోరా రు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలి
బోధన్‌రూరల్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితు ల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కోన్నారు. ఆదివారం మండలంలోని కల్దుర్కి గ్రామంలో రైతులకు సబ్సిడీ సోయాబీన్ విత్తనాల పంపిణీ చేశారు. జాతీయ నూనెగింజల పథకం కింద మొత్తం 1,424 బ్యాగుల సో యాబీన్ విత్తనాలను రైతులకు అందజేశారు. బెల్లాల్‌లో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


