కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

చెక్‌డ్యాంల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. అందుకే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల రైతులకు మేలు జరిగిందనే కంటే నష్టం ఎక్కువైందని చెప్పొచ్చు. బాధిత రైతులకు ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదు.

– బక్కూరి మోహన్‌, బాధిత రైతు, సుంకెట్‌

రైతులకు న్యాయం చేయాలి

చెక్‌డ్యాంల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో మూడుసార్లు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెక్‌డ్యాం వద్ద మట్టి కట్ట కొట్టుకపోయి మా పంట పొలాలు మూడుసార్లు నీటి పాలయ్యాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా శ్రద్ధ చూపాలి.

– నవీన్‌యాదవ్‌, బాధిత రైతు, సుంకెట్‌

వాస్తవాలు తెలియాల్సిందే..

చెక్‌డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై రైతులకు వాస్తవాలు తెలియాలి. గత ప్రభుత్వ హ యాంలో కమీషన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా నిర్మాణాలు లోపభూయిష్టంగా మారి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. విజిలెన్స్‌ విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలి.

– సుంకెట్‌ అన్వేష్‌రెడ్డి,

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement