గుండెల్లో నాన్న.. పొలంలో గుడి | - | Sakshi
Sakshi News home page

గుండెల్లో నాన్న.. పొలంలో గుడి

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

కానిస్టేబుల్‌ కృష్ణసాగర్‌ పితృభక్తి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘మాది ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఖుషీనగర్‌ జిల్లాలోని పడెరోనా అనే చిన్న పట్టణం. నాన్న వ్యవసాయంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన పని పరికరాల వ్యాపారం చేసేవారు. పదో తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. చదువు విలువ తెలిసిన నాన్న లెవంత్‌ క్లాస్‌ చదువుకోసం 1500 కిలోమీటర్ల దూరాన ఉన్న రాజస్థాన్‌లోని కోటకు పంపించారు. అక్కడ ఐఐటీ లక్ష్యంగా చదివి ముంబయి ఐఐటీలో సీటు సాధించా’ అని 2019 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి, కామారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌ తెలిపారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నాన్న చూపిన దారిలో నడవడం వల్లే ఈ రోజు సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా మీ ముందున్నాను’ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐఐటీ పూర్తవగానే చదువుకు సంబంధం లేని బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం సాధించి ఐదేళ్లు పనిచేశాను.

తరువాత యూపీఎస్సీకి ప్రిపేర్‌ కావాలనే నా కోరికను నెరవేర్చుకునేందుకు ప్రిపేర్‌ అయ్యా ను. మొదట ప్రిలిమినరీ క్లియర్‌ కాలేదు. రెండోసారి ప్రిలిమినరీ క్లియర్‌ అయినా మెయిన్స్‌లో సక్సెస్‌ కాలేదు. ఆ సమయంలో నాన్న మరింత పట్టుదలతో చదివితే సక్సెస్‌ అవుతావని ప్రోత్సహించారు. మూడో ప్రయత్నంలో 20వ ర్యాంక్‌తో ఐఎఫ్‌ఎస్‌ సాధించాను. మొదటి పోస్టింగ్‌ ఎఫ్‌డీవోగా ఇల్లందులో లభించింది. అక్కడి నుంచి డీఎఫ్‌వోగా ఆసిఫాబాద్‌లో పనిచేసి నెలకిందటే కామారెడ్డికి బదిలీపై వచ్చానని తెలిపారు. మా నాన్న అశోక్‌, అమ్మ రేఖ నాతో పాటు అన్నను చదివించడానికి వెనుకడుగు వేయలేదు. వాళ్లిచ్చి న ప్రోత్సాహంతోనే ఇద్దరం రాణించాం. అన్న బ్యాంకింగ్‌ రంగంలో ఉన్నారు. పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారు. వాళ్ల మాటను గౌరవించాలి.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): లోకం విడిచి వెళ్లినా తన గుండెల్లో ఉన్న నాన్నకు గుడి కట్టించి ఆరాదిస్తున్నాడు డొంకేశ్వర్‌ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్‌ కృష్ణసాగర్‌. వివరాల్లోకి వెళ్తే.. కీ.శే. కీని నల్ల రాజన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన రాజన్న 2018 అక్టోబర్‌ 3న గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన హఠాన్మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే తండ్రి బతికుండాగానే చిన్న కుమారుడు కృష్ణసాగర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. కొడుకుని ఖాకీ దుస్తుల్లో చూసి రాజన్న మురిసిపోయేవాడు. తండ్రి భౌతికంగా దూరమైనా ఎప్పటికీ తమలోనే ఉండాలనే సంకల్పంతో కృష్ణసాగర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో రాజన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కని గుడి కట్టించాడు. ప్రతి ఏటా తండ్రి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన నాన్నకు ఎంత చేసినా తక్కువే, ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని కానిస్టేబుల్‌ కృష్ణసాగర్‌ భావోద్వేగంతో పేర్కొన్నారు.

తన పిల్లలను ఉన్నత స్థితిలో

చూడాలని పరితపిస్తాడు..

ఎంతటి భారాన్నైనా

బాధ్యతగా భావిస్తాడు.

వ్యవసాయ క్షేత్రంలో రాజన్న గుడి,

తండ్రి విగ్రహం వద్ద పిల్లలతో కలిసి కృష్ణసాగర్‌ సెల్ఫీ

బంగారు భవిష్యత్‌వైపు

అడుగులు వేయిస్తాడు

నాన్న.. నేడు ఫాదర్స్‌ డే

సందర్భంగా ‘సాక్షి’

కథనాలు.

నాన్నే నా మార్గదర్శి

‘సాక్షి’తో డీఎఫ్‌వో నీరజ్‌ కుమార్‌ టిబ్రేవాల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement