● తొండాకూర్ గ్రామ పంచాయతీ ఆకట్టుకునే తీర్మానం
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామ పంచాయతీ ప్రజలను ఆకట్టుకునే తీర్మానం చేసింది. గ్రామంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను స్థానిక ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలకు పంపితే వారికి ఇంటి పన్నును రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం పాఠశాల హెచ్‌ఎం వరలక్ష్మితో కలిసి పాలకవర్గ సభ్యులు సమావేశమయ్యారు. మన ఊరి పాఠశాలను మనమే బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడిలో ఉచితంగా నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందుతుందని, ప్రయివేటుకు పంపితే అధిక ఫీజులు ఉంటాయని సర్పంచ్ అల్లారి గంగాధర్ తెలిపారు. తల్లిదండ్రులు ఆలోచించి ఇంటి పన్ను రద్దు ఆఫర్‌ను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
యూరియా కోసం
ఎగబడ్డ రైతులు
వేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. సుమారు మూడు లారీ ల యూరియాను అధికారులు పచ్చల నడ్కు డ సొసైటీ పరిధిలోని జాన్కంపేట్ గిడ్డంగికి కేటాయించారు. దీంతో జాన్కంపేట్, సా హేబ్‌పేట్, వాడి, కొత్లపల్లి గ్రామా ల రైతులతో పాటు ఇతర గ్రామాల రైతులు గిడ్డంగి వద్దకు తరలివచ్చారు. యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకున్నప్పటికీ వరుస క్ర మంలో పాస్‌బుక్‌లు, ఆదార్‌కార్డు లు, ఇతర వస్తువులు పెట్టుకున్నారు. యూ రియా పంపిణీ ప్రారంభం కాగానే రైతులు ఒక్కసారిగా గోదాము వద్దకు చేరుకోగా గందరగోళం నెలకొంది. తాము వేల్పూర్, లక్కోర గోదా ముల వద్దకు వెలితే తమను వాపసు పంపించారని, నడ్కుడ సొసైటీ పరిధిలోని గ్రామా ల రైతులకు ఇచ్చిన తర్వాతనే ఇతర గ్రామా ల రైతులకు ఇవ్వాలని సొసైటీ పరిధిలోని రైతులు గిడ్డంగి షట్టర్‌ను కిందికి దించారు. దీంతో రైతుల మధ్య వాద్వాదం జరిగింది. పోలీసులు వచ్చి రైతులకు వరుసక్రమంలో యూరియాను సరఫరా చేయించారు.


