11 గంటల కరెంట్‌తో తడవని మడులు | - | Sakshi
Sakshi News home page

11 గంటల కరెంట్‌తో తడవని మడులు

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

మాక్లూర్‌: ఓ వైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షం లేక ఆందోళన చెందుతుంటే.. మరోవైపు రెండు విడతలుగా 11 గంటలు మాత్రమే కరెంటు సరఫరాతో బోర్ల నుంచి వచ్చే నీరు వరి నాట్ల కోసం సిద్ధం చేసుకున్న భూమి తడవక రైతులు అయోమయానికి గురవుతున్నారు. మాక్లూర్‌ మండలంలో ఖరీఫ్‌లో 19,300 ఎకరాల వరి సాగవుతుంది. అత్యధిక రైతులు వ్యవసాయ బోర్ల ఆధారంగా సాగు చేస్తారు. కొత్తపల్లి, గుంజ్లి, చిక్లి, వల్లభాపూర్‌, ధర్మోరా, గొట్టిముక్కల, మెట్‌పల్లి, మాక్లూర్‌, ఒడ్డెట్‌పల్లి తదితర గ్రామాల్లో రైతులు మే మొదటి వారంలోనే నారు పోసుకున్నారు. నారు మడులు పెరిగి నాటడానికి సిద్ధం అయ్యాయి. కొందరు రైతులు ధైర్యం చేసి బోరుబావుల నీటితో నాటడానికి సిద్ధమై రోజుకు కొంత భూమి తడిపి దమ్ము చేశారు. అయితే 11 గంటల కరెంట్‌తో పారిన మడులే పారుతూ దమ్ము చేసిన పొలం మడు లు ఆరిపోతున్నాయి. ఇలాగైతే నాట్లు వేయలేమని కొందరు రైతులు ట్రాక్టర్లను ప్రక్కన పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement