కమ్మర్‌పల్లి : కమ్మర్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు(డైరెక్టర్లు) మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమకు తెలియకుండా సొసైటీ చైర్మన్, సీఈవో కలిసి ఉప్లూర్ రైతులకు రెండు లారీల యూరియాను ఆన్‌లైన్‌లో కాకుండా, ఆఫ్‌లైన్‌లో తరలించారని ఆరోపిస్తూ, యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ చైర్మన్ పార్శెపు అరుణ్‌రెడ్డి, డైరెక్టర్లు రెంజెర్ల మహేందర్ రెడ్డి, బద్దం రాజశేఖర్ రెడ్డి, తీగల హరీస్ రెడ్డి, సదిరం ముత్తెమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సొసైటీ సీఈవో శంకర్‌కు శనివారం అందజేశారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


