నిజామాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల పదవులను తాత్కాలికంగా ని లిపివేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. మే 30న పలు డివిజన్లకు సంబంధించి అధ్యక్షుల నియామకాలను విడుదల చేశామని, దీంతో కొన్ని డివిజన్ల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపా రు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, అర్బన్‌లకు సంబంధించిన డివిజన్ అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఫిర్యాదులను పరిశీలించి నియామకాలను విడుదల చేస్తామని తెలిపారు. అభ్యంతరాలు ఉన్నవారు సంప్రదించాలని కోరారు.


