ఎంజేపీలో ఇంటర్‌ స్పాట్‌ ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

ఎంజేపీలో ఇంటర్‌ స్పాట్‌ ప్రవేశాలు

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

ఎంజేపీలో ఇంటర్‌ స్పాట్‌ ప్రవేశాలు

ఖలీల్‌వాడి: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం ఈనెల 23న ఉదయం 10 గంటలకు మోపాల్‌ మండలంలోని కంజర ఎంజేపీ పాఠశాలలో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిలాలో 10 బాలుర, 11 బాలికలకు సీట్లు ఉన్నాయని వివరించారు. ఎంపీసీ గ్రూప్‌ కోసం 10వ తరగతిలో 500 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ సాధించినవారు అర్హులని, బైపీసీకి బాలురు 450 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ, బాలికలు 475 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ, సీఈసీ గ్రూప్‌లో 450 మార్కులు లేదా అంతకన్నా ఎక్కువ సాధించిన వారు అర్హులని తెలిపారు. విద్యార్థులు ఎస్సెస్సీ మార్కుల మెమో ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంతో హాజరై స్పాట్‌ అడ్మిషన్‌ పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement