యోగాలో ‘మహాజన్‌’ కుటుంబం | - | Sakshi
Sakshi News home page

యోగాలో ‘మహాజన్‌’ కుటుంబం

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

రుద్రూర్‌: యోగా మాస్టర్‌ మహాజన్‌ విశ్వనాథ్‌ తన కుటుంబంతో కలిసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మహాజన్‌ విశ్వనాథ్‌తోపాటు ఆయన కుమారుడు అద్వైత్‌, కుమార్తె అక్షయ శ్రీ యోగా విభాగంలో ఐదు ప్రపంచ రికార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహాజన్‌ విశ్వనాథ్‌ ఇప్పటి వరకు 52 యోగా ధ్రువపత్రాలు సాధించారు. 784 మంది విద్యార్థులకు యోగా శిక్షణ అందించారు. ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో 358 మంది విద్యార్థులు ఆయుష్‌, పీఎంశ్రీ పాఠశాలల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. ఆరోగ్యవంతమైన వృద్ధాప్యాన్ని సాధించాలంటే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని యోగ మాస్టర్‌ విశ్వనాథ్‌ మహాజన్‌ చెప్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement