ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ తప్పనిసరి

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

అదనపు కలెక్టర్‌ భుజంగరావు

సుభాష్‌నగర్‌ : ప్రయివేటు ఆస్పత్రులు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని, ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేయించాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రయివేటుగా ఆరోగ్య సేవలు అందించాలనుకునే ఏ విభాగం ఆస్పత్రి అయినా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మొదట అర్హతలు పరిశీలించి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ఇస్తామని, ఏడాది తర్వాత ఐదేళ్ల వరకు అర్హత ఉండే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వను న్నట్లు తెలిపారు. అర్హులైన వైద్యులు, సిబ్బంది మా త్రమే పనిచేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌వో రాజశ్రీ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని వివ రించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు విద్య, రవీందర్‌, సికందర్‌ నాయక్‌, ప్రోగ్రాం అధి కారి డాక్టర్‌ శిఖర, బోధన్‌ ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు మకంద, నాగనాథ్‌, డిప్యూటీ డెమో దుర్గారావు,వేణుగోపాల్‌,సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement