నోడల్‌ అధికారిగా లావణ్య | - | Sakshi
Sakshi News home page

నోడల్‌ అధికారిగా లావణ్య

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

నోడల్‌ అధికారిగా లావణ్య అర్థశాస్త్రంలో ప్రమీలకు డాక్టరేట్‌ రాంపూర్‌ విద్యార్థినికి సన్మానం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) నిరోధ క నోడల్‌ అధికా రిగా ప్రొఫెసర్‌ కే లావణ్య ని యామకమయ్యారు.వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ లావణ్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ, వాటి వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై యువతకు అవగాహన సదస్సులు, నిపుణులతో ముఖా ముఖి చర్చలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నోడల్‌ అధికారిగా నియామకమైన లావణ్యకు వర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ పరిశోధక విద్యార్థిని వై.ప్రమీల డాక్టరేట్‌ సాధించారు. ప్రొఫెసర్‌ కే రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో బాల కార్మికుల ఆర్థిక విశ్లేషణ – ఒక అధ్యయనం’ అనే అంశంపై ప్రమీల పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శుక్రవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సురేశ్‌లాల్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు స్వప్న, పున్నయ్య, నాగరాజు, సంపత్‌, శ్రీనివాస్‌, దత్తహరి, పరిశోధక విద్యార్థులు పా ల్గొన్నారు. డాక్టరేట్‌ సాధించిన ప్రమీలను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ ఎం యాదగిరి, కంట్రోలర్‌ కే సంపత్‌కుమార్‌ అభినందించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఖలీల్‌వాడి: ఎంబీఏలో అడ్మిషన్‌ తీసుకోవాలనే, ఐసెట్‌ – 2026 పరీక్ష రాయని వారికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాంమోహన్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రంజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

ఖలీల్‌వాడి: డిచ్‌పల్లి మండలంలోని రాంపూర్‌ గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని పి. శ్రీహితను డీఈవో పార్శి అశోక్‌, జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌ శుక్రవారం సన్మానించారు. 2026 ఆగస్టులో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అంతరిక్ష కార్యశాలలో శ్రీహిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆమె పాఠశాలలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో ‘మిషన్‌ శక్తిశాట్‌’ భారత రాయబారి అయిన వింగ్‌ కమాండర్‌ జయ తారే (రిటైర్డ్‌) పర్యవేక్షణలో ‘శక్తిశాట్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తిశాట్‌ మిషన్‌లో రియల్‌–టైమ్‌ శాటిలైట్‌ ప్రాజెక్టుల ద్వారా 108 దేశాల నుంచి 12 వేల మంది బాలికలకు సాధికారత కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గంగసావిత్రి, ఏటీఎల్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ ఖత్రి, బోధన్‌ ఎంఈవో నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement