గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం
● కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీకి
రూ. 4.55 కోట్లు
● వేల్పూర్ ఏఎంసీకి రూ. 99.35 లక్షలు
కమ్మర్‌పల్లి:కమ్మర్‌పల్లి, వేల్పూర్ వ్యవసాయ మా ర్కెట్ కమిటీలు గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం పొందడంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ రెండు మార్కెట్ కమిటీలకు కలిపి రూ. 5.34 కోట్లు మార్కెటింగ్ రుసుము(ఫీజు) రూపంలో లక్ష్యం నిర్దేశించింది. లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీకి చెక్‌పోస్ట్‌ల ద్వారా రూ.60 లక్షలు, ప్రభుత్వ ఏ జెన్సీల ద్వారా రూ. 3 కోట్ల 95 లక్షల 40 వేలు కలి పి రూ. 4 కోట్ల 55 లక్షల 40 వేలు లక్ష్యం నిర్దేశించింది. వేల్పూర్ మార్కెట్ కమిటీకి చెక్‌పోస్ట్‌ల ద్వారా రూ.30 లక్షలు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రూ. 69.35 లక్షలు కలిపి రూ. 99.35 లక్షలు మార్కెటింగ్ రుసుము వసూలు చేయాలని స్పష్టం చేసింది.
2025–26లో రూ. 7.13 కోట్ల ఆదాయం
కమ్మర్‌పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీలు చెక్‌పోస్ట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.7.13 కోట్ల ఆదాయం పొందాయి. కమ్మర్‌పల్లి ఏఎంసీకి మొత్తం రూ. 3.64 కోట్లు లక్ష్యం విధించగా, రూ. 5.34 కోట్లు వసూలయ్యాయి. వేల్పూర్ ఏఎంసీకి రూ. 80.90 లక్షలు లక్ష్యం నిర్దేశించగా, రూ. కోటీ 79 లక్షల 2 వేలు వసూలయ్యాయి. రెండు మార్కెట్ కమిటీలు లక్ష్యానికి మించి ఫీజు వసూలు చేయడంతో ఈ ఏడాది మార్కెటింగ్ ఫీజు లక్ష్యాన్ని పెంచింది.
కమ్మర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం
ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సిబ్బంది సహకారంతో గడువులోగా పూర్తి చేస్తాం. గతేడాది విధించిన లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం. పంట ఉత్పత్తులు అక్రమంగా తరలిపోకుండా చెక్‌పోస్టుల వద్ద తమ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చిన లక్ష్యాన్ని కూడా మార్చి నెలాఖరులోగా వసూలు చేస్తాం.
– జే మధుసూదన్, కార్యదర్శి, మార్కెట్ కమిటీ, కమ్మర్‌పల్లి


