సీఎంసీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు | - | Sakshi
Sakshi News home page

సీఎంసీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

చైర్మన్‌, ఎండీ షణ్ముగం మహాలింగం

నిజామాబాద్‌ రూరల్‌: డిచ్‌పల్లి మండల పరిధిలో ఉన్న సీఎంసీ (క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ) ప్రతిష్టను భంగపరిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్‌, ఎండీ షణ్ముగం మహాలింగం హెచ్చరించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రూ.200 కోట్ల పెట్టుబడితో కళాశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తే దురుద్దేశ పూర్వకంగా సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంసీ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న వివాదాలను వివరించారు. సీఎంసీ క్యాంపస్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఎఫ్‌ఐఆర్‌ నం.176/2026 ద్వారా సీఎస్‌ఐ ప్రతినిధులైన బి. విమల్‌ సుకుమార్‌, దయానంద్‌, కేవీ ప్రసాద్‌ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరిపై ఈ నెల 11న కేసు నమోదైనట్లు తెలిపారు. అక్టోబర్‌ 2024 నుంచి సీఎస్‌ఐ టీఏ మెదక్‌ డయాసిస్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు సీఎంసీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement