మాక్లూర్ : ప్రాణవాయువునిచ్చే అరణ్య అర్బన్ పార్క్‌ల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వా టి సంఖ్యను మరింత పెంచాలని ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మండ లంలోని అడవిమామిడిపల్లి, చిన్నాపూర్ శివార్లలో 63వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో 476 ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల నిధులతో నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్‌ను ముఖ్యమంత్రి ఏ రే వంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి గురువారం వర్చుల్‌గా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. అనంత రం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వంటి మహానగరాల్లో గాలిని కొనుక్కు నే పరిస్థితి వచ్చిందని, పరిస్థితులను గుర్తించి ప్ర భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 11 అరణ్య అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అర ణ్య అర్బన్ పార్క్‌లోకి ఆకతాయిలు చేరి సందర్శకులను వేధిస్తున్న విషయం తన దృష్టికి వచ్చింద ని అటవీ అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి ఫిర్యాదులు మళ్లీ వస్తే సహించేది లేదన్నా రు. ఎవరైనా జులుం ప్రదర్శిస్తే వెంటనే పోలీసుల కు సమాచారం ఇచ్చి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధి కారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ అనేది తన ఒక్కడితో సాధ్యం కాదన్నా రు. చిన్నాపూర్ శివారులో అటవీ భూమి కబ్జాకు గురవుతోందని ఎమ్మెల్యే పలుమార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, స్థానిక అధికారులు బాధ్యత తీ సుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, బాసర సర్కిల్ అటవీ అధికారిణి అర్పన అడవుల సంరక్షణపై మాట్లాడారు. అడిషనల్ డీసీపీ శుభంప్రకాశ్, అడిషనల్ కలెక్టర్లు కిరణ్‌కుమార్, భుజంగరావు, డీఆర్డీవో జి సాయన్న, అడవిమామిడిపల్లి, చిన్నాపూర్ సర్పంచ్‌లు కూన లత, పు ప్పాల చిన్నా, అటవీ అధికారులు పాల్గొన్నారు.
పార్క్‌ల సంఖ్యను మరింత పెంచాలి
ఆకతాయిలను రానివ్వొద్దు
అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్


