సుభాష్‌నగర్: మానవత్వంతో రక్తదానం చే సి విలువైన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. ప్రపంచ రక్తదాతల వారోత్సవాలను పురస్కరించుకుని ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కో సం రక్తదాన శిబిరాన్ని నగరంలోని పవర్ హౌజ్ ఆవరణలో ఉన్న గోల్డెన్ జూబ్లీ సమావేశమందిరంలో గురువారం ఏర్పాటు చేశారు. ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు బోధన్ డీఈ మహ్మద్ ముక్తార్‌తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారిద్దరితోపాటు ఆ యా యూనియన్‌లు, అసోసియేషన్‌ల నా యకులు, ఉద్యోగులు మొత్తం 50 మంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డీఈలు ఎం శ్రీనివాస్‌రావు, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర నాయక్, తోట రాజశేఖర్, పీవో పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు
జరిగేలా చూడాలి
ఆర్మూర్‌టౌన్ : గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా చూడాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. డివిజన్‌లోని పట్టణ ఆరోగ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పని చేస్తున్న డాక్టర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, రిపోర్టింగ్ అధికారులతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశో క్, ఆర్మూర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.
జీపీ రికార్డుల తనిఖీ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పీఆర్ అండ్ ఆర్‌డీ డిప్యూటీ డైరెక్టర్ (విజిలెన్స్) సుబ్రమణ్యం సందర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణను, ఉపాధిహామీ పనుల రికార్డులను తనిఖీ చేశారు. తడి, పొడి చెత్త వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సుప్రీం కోర్డు గైడ్‌లైన్స్ తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎల్‌పీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. సర్పంచ్ రవికిరణ్, ఉప సర్పంచ్ ఖాదర్, వార్డు మెంబర్లు, పంచాతీయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


