సర్‌లో తప్పిదాలకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

సర్‌లో తప్పిదాలకు తావివ్వొద్దు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్నిస్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియలో తప్పిదాలకు తావివ్వొద్దని, పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ నెల 25 నుంచి ‘సర్‌’ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మాస్టర్‌ ట్రైనర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్‌ను పూర్తి చేయాలన్నారు. ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతర ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్ళారా? మృతి చెందారా? రెండు చోట్ల పేర్లు ఉన్నాయా? అనే అంశాలను నిశితంగా గమనించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ సర్వే వివరాల ఆధారంగానే ఓటరు జాబితాను రూపొందించనున్న దృష్ట్యా పొరపాట్లకు అవకాశం ఇ వ్వొద్దన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఒక్క ఓట రు పేరు కూడా తప్పిపోకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇప్పటికే ప్రీ– మ్యా పింగ్‌ చేసుకున్న ఓటర్లకు సంబంధించి కూడా ఏవై నా మార్పులు చేయాల్సి ఉంటే, వాటిని సరి చేయొచ్చన్నారు. అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండుతున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలలో ఉంటున్న వారి ఎన్యుమరేషన్‌ ఫారంపై వారి కు టుంబ పెద్ద సంతకం తీసుకోవచ్చని స్పష్టం చేశా రు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలో బీఎల్‌వోల కృషితో జిల్లాలోనే అత్యధికంగా ప్రీ మ్యాపింగ్‌ 93.5 శాతమై ప్రస్తుతం చివరి దశలో ఉందన్నారు. నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement