రాష్ట్రంలో అధ్వానంగా విశ్వవిద్యాలయాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అధ్వానంగా విశ్వవిద్యాలయాలు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో

పూడికతీతపై దృష్టి సారించాలి

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

సుభాష్‌నగర్‌ : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు అ ధ్వానంగా తయారయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్‌, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగరంలోని అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో పార్టీ నాయకులు, పసుపు రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న 19 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు. 2026–27 బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం తగదన్నారు. ఉత్తర తెలంగాణజీవనాడి అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పూడికతీత, కాలువల ఆధునీకరణ, నీటి నిల్వ సా మర్థ్యం పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రెండున్నరేళ్లు గ డుస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజాంషుగర్స్‌ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం పసుపు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పసుపుబో ర్డు ఏర్పాటు చారిత్రక నిర్ణయమని, పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగిందన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని దత్తాత్రేయ సూచించారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, సీనియర్‌ నాయకులు లోక భూపతిరెడ్డి, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, గీతారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముక్కా దేవేందర్‌ గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ ప్రమోద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement