రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే.. | - | Sakshi
Sakshi News home page

రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ

బాగుపడదు

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌: రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద 63వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిది తుగ్లక్‌ పాలన అని విమర్శించారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని, కేసీఆర్‌ పాలనలో రాజుగా ఉన్న రైతు రేవంత్‌రెడ్డి పాలనలో రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌తోపాటు వ్యవసా య అధికారులు ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నా రు. కలెక్టర్‌ స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రైతుల తరపున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని ప్రకటించారు. కలెక్టర్‌ తరఫున అదన పు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ ధర్నా స్థలానికి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడించగా, రైతుల తరఫున పలు డిమాండ్‌లను ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement