లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైబర్ నేరాలపై ఖాతాదారులు, బ్యాంకు సిబ్బందికి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1903కి కాల్ చేయాలని సూచించారు. ఎవరికి ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు ఓటీపీలు చెప్పమని ఎవరు అడగరని అన్నారు. అత్యవసర సమయాల్లో 100/112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. కళాబృందం సభ్యులు తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, షీటీమ్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ, బ్యాంకు మేనేజర్ జ్యోతి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.


