పసికందుతో పరీక్షకు | - | Sakshi
Sakshi News home page

పసికందుతో పరీక్షకు

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

పసికందుతో పరీక్షకు గడుగు గంగాధర్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం

టెట్‌ రాసిన అభ్యర్థిని సహకరించిన భర్త

ఖలీల్‌వాడి: జిల్లాలోని సాలూర మండలానికి చెందిన కందిమల్‌ కళ్యాణి, కందిమల్‌ అభినయ్‌ దంపతులు కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ లక్ష్యాలపై తమ నిబద్ధతను చాటిచెప్పారు. కందిమల్‌ కళ్యాణి 11 రోజుల పసికందుతో నిజామాబాద్‌లో నిర్వహించిన టెట్‌ పరీక్షకు హాజరైంది. భర్త అభినయ్‌ కూడా పరీక్ష కేంద్రానికి వచ్చి పసిబాబును ఆడించారు. తల్లి పరీక్ష రాస్తుండగా తండ్రి బయట బిడ్డను చూసుకుంటూ నిలిచిన సన్నివేశం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. నిజామాబాద్‌ పరీక్ష కేంద్రంలో కనిపించిన ఈ ఘటన కుటుంబ బంధం, బాధ్యత, పరస్పర సహకారానికి మంచి ఉదాహరణగా నిలిచింది.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని ఆదర్శనగర్‌ లో నివాసం ఉంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్‌ సభ్యులు గడుగు గంగాధర్‌ ఇంట్లో గురువారం రా త్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆయన ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో భారీ ఎ త్తున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాప శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారు లు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement