మాతాశిశు మరణాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలను నివారించాలి

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

బోధన్‌టౌన్‌(బోధన్‌): ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీల సంఖ్యను పెంచాలని, మాతా శిశు మరణాలను నివారించాలని డీ ఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మార్పు బృందంతో కన్వర్జెన్స్‌ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులకు నాణ్యమైన సేవలందించాలని, వారికి తప్పని సరిగా ఏఎన్‌సీ పరీక్షలు చేయాలని, హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ ఉన్న వారిని ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జి ల్లా ఆస్పత్రి వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి సురక్షత మాతృత్వ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వం ని ర్వహించే మాతృ, శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివా స్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య, వైద్యులు పాల్గొన్నారు.

ఫిఫా టాలెంట్‌

అకాడమీకి నక్షత్ర ఎంపిక

మోపాల్‌: ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) – ఫిఫా టాలెంట్‌ అకాడ మీ శిక్షణకు బోర్గాం(పి) జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని నక్షత్ర ఎంపికై ంది. ఆమెను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఈవో అశోక్‌ తదితరులు బుధవారం పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సీ హెచ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నక్షత్ర ఫుట్‌బాల్‌ కోచ్‌ నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోందన్నారు. కార్పొరేటర్‌ యాదల నరేశ్‌, ఎంఈవో అమ్దాపూర్‌ సాయిలు, హెచ్‌ఎం శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీఎంఎఫ్‌ఎంఈ రుణాల క్లియరెన్స్‌ డ్రైవ్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం రుణాల పరిష్కారం కోసం బుధవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక క్లియరెన్స్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న 121 దరఖాస్తులపై లబ్ధిదారులు, బ్యాంకు మేనేజర్లతో ముఖాముఖి సమీక్ష చేపట్టారు. దర ఖాస్తుదారులు పూర్తి పత్రాలతో తమ బ్యాంకులను సంప్రదిస్తే రుణాలు త్వరగా మంజూరయ్యేలా చూస్తామని అధికారులు అన్నా రు. హైదరాబాద్‌కు చెందిన అధికారుల బృందం సభ్యులు నవీన్‌, రాజేశ్‌లు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. డీఆర్డీవో సాయన్న, ఏపీడీ మధుసూదన్‌, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆలయాల హుండీ ఆదాయం లెక్కింపు

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం, జెండా బాలజీ, గోల్‌హనుమాన్‌, మాధవనగర్‌ సాయిబాబా ఆ లయాల హుండీ ఆదాయాన్ని బుధవారం లె క్కించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ, ధ ర్మ దాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామారావు ఆధ్వర్యంలో, ఈవోలు శ్రీరాం రవీందర్‌, వేణు పర్యవేక్షణలో సిబ్బంది, భ క్తులు ఆదాయాన్ని లెక్కించారు. కంఠేశ్వరాలయానికి రూ.4,03,405, జెండా బాలజీ ఆలయానికి రూ.1,60,297 ఆదాయం సమకూరింది. అలాగే గోల్‌హనుమాన్‌ ఆలయా నికి రూ.53,299, మాధవనగర్‌ సాయిబాబా ఆలయానికి రూ.1,37,971 ఆదాయం సమకూరింది. ఆలయాల చైర్మన్‌లు సిరిగిరి తిరుపతి, బండారి నరేందర్‌, ప్రమోద్‌కుమార్‌, అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement