● కమ్మర్‌పల్లి, అడవిమామిడిపల్లిలో
ఎన్‌హెచ్ 63పై రాస్తారోకో
● యూరియా యాప్‌ను
రద్దు చేయాలని డిమాండ్
కమ్మర్‌పల్లి/మాక్లూర్: యూరియా యాప్‌ను రద్దు చేయడంతోపాటు వ్యవసాయానికి నాణ్యమైన వి ద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లెక్కారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రం, మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్ విధానం, మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవడం కా రణంగా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరా యం ఏర్పడుతుండడంతో బోరు మోటార్లు, స్టార్ట ర్లు కాలిపోతున్నాయని కమ్మర్‌పల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మర్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు ఏవో రమ్యశ్రీ, తహసీల్దార్ నరేశ్, ఎస్సై సతీశ్‌కుమార్ చేరుకుని వారితో మాట్లా డారు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. అడవిమామిడిపల్లి వద్ద రాస్తారోకో చేస్తున్న రైతులను ఎస్సై అనిల్‌రెడ్డి సముదాయించి విరమింపజేశారు.
కమ్మర్‌పల్లిలో రైతులతో మాట్లాడుతున్న అధికారులు
అడవి మామిడిపల్లి వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు


