● బూత్‌స్థాయి అధికారులు
ప్రతి ఇంటికి వెళ్లాలి
● ఆర్మూర్ సబ్ కలెక్టర్
అభిజ్ఞాన్ మాల్వియా
ఆర్మూర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సూచించారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ అధికారులకు, సూపర్‌వైజర్ల కు, బూత్ లెవల్ ఏజెంట్లకు బుధవారం ప్రత్యేక శిక్ష ణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్వియా మాట్లాడుతూ.. అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చాలన్నారు. అలాగే మరణించిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు అశోక్, జగదీశ్, రఘుపతి, రాంప్రసాద్ శిక్షణ తరగతులను నిర్వహించారు. తహసీల్దారు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్వే ప్రక్రియకు సహకరించాలి
బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని ఆర్డీవో విజయకుమారి రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఈ నెల 25 నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం రెవెన్యూ డివిజన్ ఆఫీస్‌లో సమావేశం నిర్వహించారు. సర్వే షెడ్యూల్, బూత్‌లవారీగా బీఎల్‌ఏల నియామకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.


