ఏడు రకాలకే బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

ఏడు రకాలకే బోనస్‌

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

స్పష్టం చేసిన మంత్రి తుమ్మల

మోర్తాడ్‌(బాల్కొండ): సన్నాలు సాగు చేసే రైతులకు ‘బోనస్‌’ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకు ఏ రకం సన్నాలైనా బోనస్‌ వర్తిస్తుందని అధికార యంత్రాంగం చెప్పగా.. ప్రభుత్వం సూచించిన ఏడు రకాలకే ఇస్తామని తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సాగు ప్రమోషన్‌ పేరుతో మే నెలలో ఎనిమిది సన్న రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎనిమిది రకాలకే ప్రాధాన్యం అని చెప్పి ఆ తరువాత ఏ సన్న రకాలకై నా బోనస్‌ వర్తిస్తుందన్నారు. తాజాగా మంత్రి ఏడు రకాలను సూచించడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రైస్‌మిల్లర్లు సూచించిన సన్నాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం సూచిస్తున్న సన్న రకాల విత్తనాలు ఏ మేరకు అందుబాటులో ఉంచుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగు ప్రమోషన్‌లో సూచించిన రకాల్లో నుంచి కొన్నింటిని తొలగించి తాజాగా ఏడు రకాలనే తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే వర్షాకాలం సాగుకోసం విత్తనాలు కొనుగోలు చేసుకున్న రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

ఏడు రకాలు ఇవే..

అన్ని రకాలకు ఇవ్వాలి

రైతులు నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విత్తనం రకాన్ని ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కేవలం ఏడు రకాలకే అనే నిబంధన విధించకుండా అన్ని సన్న రకాలకు బోనస్‌ వర్తింపజేయాలి. లేకుంటే రైతులు నష్టపోతారు. – డాక్టర్‌ కిషన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement