కంఠేశ్వరాలయాన్ని సందర్శించిన చరిత్రకారులు | - | Sakshi
Sakshi News home page

కంఠేశ్వరాలయాన్ని సందర్శించిన చరిత్రకారులు

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని కొ త్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్‌, కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయం ఉత్తర దిక్కున ఉన్న కోనేరు వద్ద పు లిని వేటాడుతూ మరణించిన వీరుని యాదిలో వేసిన పులివేట వీరగల్లు శిల్పాన్ని గుర్తించారు. ప్రతిమ లక్షణాల్ని వివరించారు. నీలకంఠేశ్వరాలయ నిర్మాణం ఉత్తర భారతీయ శైలిలో ఉందని, 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కల్గినదని తెలిపారు.వారి వెంట భీంగల్‌ పట్టణ సర్వసమాజ్‌ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement