న్యూస్‌రీల్
శ్రీరాం సాగర్‌లో
బహిరంగ చర్చకు సిద్ధం
అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ మాజీ ఎమ్మెల్యే బిగాలకు సవాల్ విసిరారు.
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 18 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం కేవలం 16.26 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలు పోను మిగిలేది 6.26 టీఎంసీలు మాత్రమే కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం (1,091అడుగులు) 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.26 టీఎంసీలకు పడిపోయింది. గత సీజన్‌లో జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చినప్పటికీ పూడిక కారణంగా నీటి నిల్వ చేయలేక దిగువకు వదిలారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో కొంత మాత్రమే నీరు ఉంది. దీంతో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి వరద వస్తేనే జలాశయంలోకి నీరు వస్తుంది. లేకుంటే గడ్డు పరిస్థితే. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో ఆయకట్టు రైతులతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ధర్పల్లి మండలంలో 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామడుగు జలాశయంలో ఇప్పటికే 0.3 టీఎంసీల పూడిక చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం జలాశయంలో 185 మిలియన్ క్యూసెక్కుల (మిలియన్ క్యూబిక్ ఫీట్లు) నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్ స్టోరేజీ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లోని సాగుభూములకు కుడి, ఎడమ కాలువల ద్వారా 6,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీన్ని 1964లో నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో కుడి, ఎడమ కాలువలో ముళ్ల పొదలు పెరిగి చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల కాలువలకు సీసీ లైన్లు దెబ్బతినడంతో నీటిని వదిలినప్పుడు లీకేజీ అవుతున్నాయి.
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశ యంలో మాత్రం నీటి నిల్వ సామర్థ్యం 1299.6 అ డుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1295.6 అడు గుల మేర ఉంది. అలీసాగర్ నుంచి ప్రతిరోజూ ని జామాబాద్ నగర ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్ ద్వారా 30 క్యూసెక్కులు సరఫరా జరుగుతోంది. జలాశయంలోని నీరు మరో 28 రోజుల వరకు నిజామాబాద్ నగరానికి తాగునీటి సరఫరాకు సరిపోతాయి. దీని కింద ఎడపల్లి మండలంలో 18వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది.
ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి నిల్వలు
డెడ్ స్టోరేజీకి 5 టీఎంసీలు.. తాగునీటికి 5 టీఎంసీలు..
ఇక మిగిలింది 6.36 టీఎంసీలే
ఎగువ మహారాష్ట్రలో వర్షాలు కురిసి వరద వస్తేనే ఈసారి ఊరట
రామడుగు జలాశయంలోనూ
డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటి నిల్వ


