బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా వ్యవహరించాలి

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌) : భావితరాలకు నష్టం వాటిల్లకుండా ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హితవు పలికారు. సమాజం కోసం మనం ఏం చేస్తున్నామన్నది గుర్తెరిగి బాధ్యతతో మెలగాలని సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో గురువారం గ్రామ, వా ర్డుసభలకు శ్రీకారం చుట్టారు. మోపాల్‌ మండలం న్యాల్‌కల్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ చంద్రకళ గంగాప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసిందని, తదనుగుణంగా అనుకూలమైన పంటలు ఎంచుకోవాలని హితవు పలికారు. పంట మార్పిడి విధానాలు అవలంబించాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటిస్తూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలను వినియోగించాలని సూచించారు. నాసిరకం, నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, అలాంటి డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. తనిఖీల కోసం పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. పర్యావరణానికి హాని చేకూర్చేలా వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులకు రూ.5 వేలు నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనాన్ని పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సహకరిస్తూ ఇంటికి వచ్చే బీఎల్‌వోలకు తగిన వివరాలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. చెరువుల, శిఖం భూములు కబ్జాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

శాంతి భద్రతల పరిరక్షణ

ప్రతి పౌరుడి బాధ్యత

శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పొలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య గుర్తుచేశారు. నేరాల నియంత్రణకు ఉపకరించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలు, దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్‌రావు, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్‌, నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాశ్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో రాములు నాయక్‌, తహసీల్దార్‌ రేఖ, ఉపసర్పంచ్‌ సతీశ్‌ రావు, ఎంఈవో అమ్దాపూర్‌ సాయిలు, ఏవో జాదవ్‌ హీరా, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరి కొయ్యలకు నిప్పు పెడితే

రూ.25 వేల వరకు జరిమానా

పంట మార్పిడి విధానాలు

అవలంబించాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ల్లో భాగంగా గ్రామసభలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement