సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో రవాణాకు అత్యంత కీలకమైన 63వ నంబర్ జాతీ య రహదారి ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల వరకు, 563వ నంబర్ జాతీయ రహదారి జగిత్యా ల–కరీంనగర్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల ను విస్తరించేందుకు గాను రూ.7,597.16 కోట్ల ని ధులు కేటాయించేందుకు నిర్ణయించారు. ఈ రో డ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఉత్తర తెలంగాణలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న రోడ్డు కావడంతో పలుచోట్ల బైపాస్‌లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర ప్రాంతాల్లో ఈ బైపాస్‌లు నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రద్దీ నివారించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు అధిగమించనున్నారు. వీటి నిర్మాణంతో ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు గంటన్నర ప్రయాణ సమయం, జగిత్యాల నుంచి కరీంనగర్‌కు 54 నిముషాల ప్రయాణ స మయం ఆదా కానుంది.
ఈ రోడ్డు నిర్మాణంలో భా గంగా టోల్ గేట్ల ఏర్పాటు లేకుండా, ఎక్కడా ఆగకుండా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేశా రు. ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా టోల్ చార్జి నేరుగా తీసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రోడ్డు కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గతంలో పలుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోడ్లను మంజూరు చేయడంపై అర్వింద్ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర కేబినెట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాదాల బెడద తప్పనుంది
పెర్కిట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు వెళ్లే మార్గాన్ని నాలుగు లేన్లు గా విస్తరిచండం హర్షించదగ్గ విషయం. రహదారి విస్తరణతో రోడ్డు ప్రమాదాల బెడద తప్పనుంది. ఇక నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే వారు నిబ్బరంగా ప్రయాణించవచ్చు.
– జక్కుల మోహన్, ఆరోగ్య కార్యకర్త, పెర్కిట్
ప్రయాణం సాఫీగా..
ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శానికి వెళ్లే ఇతర జిల్లాల వా రికి రహదారి విస్తరణతో ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఇరుకై న మార్గం వెంట అ నేక భారీ వాహనాలు ప్రయాణిస్తుండడంతో రోడ్డు ప్ర మాదాలు జరిగేవి. రహదారి విస్తరణతో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. – వి లక్ష్మీనారాయణ,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెర్కిట్
63, 563 నంబర్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా
మార్చేందుకు కేంద్రం పచ్చజెండా
190.76 కిలోమీటర్లకు
రూ.7,597.16 కోట్లు కేటాయింపు
ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు
తగ్గనున్న గంటన్నర ప్రయాణ సమయం
కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ అర్వింద్
ధన్యవాదాలు


