వలలు తొలగించిన అటవీ అధికారులు | - | Sakshi
Sakshi News home page

వలలు తొలగించిన అటవీ అధికారులు

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నీరు తగ్గిన ప్రాంతాల్లో మత్స్యకారులు వదిలి వెళ్లిన పాత వేట వలలను ఆర్మూర్‌ ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎఫ్‌ఆర్వో సుధాకర్‌, బీట్‌ ఆఫీసర్‌ లింబాద్రిలు గుర్తించి వాటిని తొలగించారు. వన్యప్రాణులు, జింకలు, పక్షులు ఈ వలలలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అందుకే తొలగింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మత్స్యకారులు పాత వలలను వదిలి వెళ్లకూడని అధికారులు వారికి సూచించారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌ : నగరంలోని 33/11కేవీ వినాయక్‌నగర్‌ 11 కేవీ ఫీడర్‌–1 ఏబీ స్విచ్ఛుల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉద యం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–3 ఏడీఈ వినోద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్‌లోని నసీ మ్‌కాలనీ, తెలంగాణ తల్లి ఏరియా, యాద గిరి బాగ్‌, మహాన్‌, అమృతగంగా అపార్ట్‌మెంట్లు, గాయత్రినగర్‌ రోడ్‌–1, మార్కండేయ ఆలయం, షాదుల్లా దర్గా, దోబీగల్లి, నకాష్‌ గల్లి, ఆర్యసమాజ్‌ ఏరియా, బాలికల హైస్కూల్‌, సిర్నాపల్లి గడి తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొ న్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

బడిబాట

షార్ట్‌ ఫిలిం విడుదల

ఖలీల్‌వాడి: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో, సమగ్ర శిక్షా సౌజన్యంతో రూపొందించిన ‘బడిబాట’ షార్ట్‌ ఫిల్మ్‌ను జిల్లా అదనపు కలె క్టర్‌ (స్థానిక సంస్థలు) భుజంగరావు విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో నే అందుతున్నదనీ, తల్లిదండ్రులు తమ పి ల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. డీఈవో అశోక్‌ మాట్లాడుతూ.. తల్లిదండ్రులని చైతన్యవంతుల్ని చేస్తూ, పిల్లలందరినీ ప్రభు త్వ బడిలో చేర్పించేలా ప్రోత్సహించడానికి ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించినట్లు తెలిపారు. అనంతరం షార్ట్‌ ఫిల్మ్‌ రచన, దర్శకత్వం వహించిన డా.కోకిల నాగరాజు, నటించిన డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు, చింతల శ్రీనివాస్‌ గుప్తా, రాజశేఖర్‌ను అభినందించారు. డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, విద్యా శాఖ సెక్టోరియల్‌ అధికారులు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసరావు, బాలకృష్ణారావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement