జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఇన్నాళ్లూ ఎండవేడిమి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం.. వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఇందల్వాయి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పొలం మడుల్లో వర్షపునీరు నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్న రైతుల్లో చిరుజల్లులు సంతోషాన్నిచ్చాయి. దీంతో వరి నారు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. – ఇందల్వాయి
ఇందల్వాయి మండల శివారులో పొలాల్లోకి చేరిన వర్షపు నీరు


