ఢిల్లీ సదస్సులో ‘ఇందూరు పసుపు’ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సదస్సులో ‘ఇందూరు పసుపు’

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఢిల్లీలోని కాన్‌స్టిట్యూ షన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో గురువారం జరిగిన జాతీయ స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫె డరేషన్‌ సదస్సులో జిల్లాకు చెందిన ఎఫ్‌పీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఏపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన జిల్లా ప్రతినిధులు జిల్లాలో ని జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి తీసుకెళ్లిన ఆర్గానిక్‌ పసుపు పొడిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా పసుపునకు మంచి ప్రసిద్ధి చెందిందన్నారు. గ్రామీణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా నుంచి ఎఫ్‌పీవో అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి. మోర్తాడ్‌ నుంచి కస్పా లక్ష్మీనరసయ్య, మనోహరాబాద్‌ మైలారం రాజారెడ్డి, జగిత్యాల జిల్లా నుంచి ఇటికాల ఎఫ్‌పీవో అధ్యక్షుడు గడ్డం రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement