ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించాలి

Jun 5 2026 1:12 AM | Updated on Jun 5 2026 1:12 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

సుభాష్‌నగర్‌ : గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదక ర లక్షణాలను ముందే గుర్తించి మరణాలను తగ్గించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లోగల డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె గురువా రం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మె డికల్‌ నాలెడ్జ్‌ను పెంచుకుంటూ వైద్యసేవలను అందించాలన్నారు. సీపీఆర్‌ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గర్భిణి, బాలింతను ఫాలో అప్‌ విజిట్స్‌లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ వోలు రవీందర్‌, సమత, పిల్లల వైద్య నిపుణులు, సీ్త్ర వైద్య నిపుణులు శ్రీకాంత్‌, నవీన్‌, ఉమా, వనిత, డీఐవో అశోక్‌, 12 పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement