తాళం వేసిన మూడిళ్లల్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన మూడిళ్లల్లో చోరీ

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

4 తులాల బంగారం, రూ.55 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు

డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళం వేసిన మూడిళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సుద్దపల్లి గ్రామానికి చెందిన మలావత్‌ నరేష్‌ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అలాగే గ్రామానికి చెందిన చింతం రాజశేఖర్‌, సుమన్‌ (అన్నదమ్ములు) తమ ఇళ్లకు తాళాలు వేసి డాబాలపై నిద్రించారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు చేతిలో రాడ్లు పట్టుకుని వచ్చి మొదట నరేష్‌ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ధ్వంసం చేసి, తాళం పగులగొట్టి ఇంట్లో దాచుకున్న రూ.3తులాల బంగారం, రూ.45వేలు ఎత్తుకెళ్లారు. అనంతరం రాజశేఖర్‌, సుమన్‌ ఇళ్లలోని తులం బంగారం, రూ.10వేలు ఎత్తుకెళ్లారు. రాజశేఖర్‌ భార్య ఫోన్‌ను దొంగిలించారు. ఓ దుండగుడు తన కత్తిని అక్కడే మర్చిపోయాడు. వారి అలజడికి నిద్రలేచి కిందకు వచ్చిన బాధితులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వినోద్‌, ఎస్సై ఆరిఫ్‌ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement