ధర్పల్లి: మండలంలోని ద మ్మన్నపేట్ గ్రామ శివారులో గల చెరువు కట్టపై ఇరువైపులా ఏర్పాటుచేసిన తాటి వ నంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 200 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. జీవనోపాధి చూపించే చెట్లు దగ్ధమవడంతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం తమను ఆదుకోవాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా నల్లవెల్లి కరుణాక ర్ రెడ్డి నియమితులయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షు డు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా కామారెడ్డి జిల్లా కు చెందిన కరుణకర్‌రెడ్డి మూడోసారి ఎన్నికయ్యా రు. రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి గురువారం నియామక పత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ప్రతినిధులు గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమా ర్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.


