● డిచ్‌పల్లి శివారులో కారును
వెనుకనుంచి ఢీకొన్న బైక్
● ఇద్దరు యువకులు కిందపడగా,
లారీ వెళ్లడంతో మృతి
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి శివారులోని హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్క నూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్ (30) బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు సొంత ప నుల నిమిత్తం సంగమేశ్వర్ నుంచి కామారెడ్డికి బైక్ పై బయలుదేరాడు. జంగంపల్లి గ్రామశివారులో గు ర్తు తెలియని వాహనం ఢీకొని అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భా ర్య అనురాధ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అంజనేయులు వివరించారు. జంగంపల్లి గ్రామశివారులో గురువా రం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో హైవే పక్కన ఉన్న ఓ చెట్టు రోడ్డుపై పడింది. ఆ సమయంలోనే మహేష్ చెట్టును తప్పించి, నెమ్మదిగా వెళ్లడంతోనే గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండల కేంద్రం శివారు నాగ్‌పూర్ గేట్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్‌పల్లి మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన చిన్న స్వామి అలియాస్ నవీన్ (20) డిగ్రీ చదువుతుండగా, బలరాం అలియాస్ నాని (24) స్టోన్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బైక్‌పై ధర్పల్లి నుంచి జక్రాన్‌పల్లికి బయలుదేరారు. డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్ సమీపంలో హైవేపై మూలమలుపు వద్ద వారి ముందువెళ్తున్న కారును తప్పించబోయి, కారు వెనక భాగాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరు బైక్‌తోపాటు కిందపడిపోయారు. అదే సమయంలో వీరి వెనకే వస్తున్న లారీ వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ సాయిచైతన్య సైతం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాష్, డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్, అధికారులు ఉన్నారు.
బలరాం (ఫైల్)
చిన్న స్వామి (ఫైల్)


