క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

ఖలీల్‌వాడి: క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం వి జయానికి మూలమని మాజీ ఐపీఎస్‌ అధికారి, జే డీ లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో జరిగే ఐఐటీ–జేఈఈ, నీట్‌ శిక్షణలో ఇస్తున్న రెసోనెన్స్‌ వి ద్యాసంస్థ సెంటర్‌ను నిజామాబాద్‌లోని ఓ ఇంట ర్నేషనల్‌ హోటల్‌ వేదికగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్‌లో ఫౌండేషన్‌ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తు న్న రెసోనెన్స్‌ విద్యాసంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెసోనెన్స్‌ ఎండీ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అ ధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా, నిరంతర వి ద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ సెంటర్‌ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్‌, ఒలింపియాడ్స్‌ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement