డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని ముల్లంగి(ఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. రైతు డిస్కం వల్ల రైతులకు ఉచిత కరెంట్ తొలగించే కుట్ర చేస్తున్నారని, దీనివెనక వేల కోట్ల స్కాం ఉందని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించడం సిగ్గు చేటన్నారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాలం వెళ్లదీసిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. తమ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని, కుంభకోణాలు చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, సొసైటీ చైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, నాయకులు అశోక్, మదుసూదన్, నితిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


