అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

మాజీ ఎమ్మెల్యే బిగాలకు

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సవాల్‌

సుభాష్‌నగర్‌: తాను ఒక్కరూపాయైన అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాకు నిజామాబా ద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ స వాల్‌ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలోగల గణపతి ఆలయానికి తాను వస్తానని బిగాల వస్తా రా? అని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ధన్‌పాల్‌ మాట్లాడారు. అవినీతి, అభివృద్ధిపై కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక బిగాల తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తా ను ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క గుంట భూమి కూడా కొనుగోలు చేయలేదని, బిగా ల మాత్రం నగరంలో ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదని విమర్శించారు. రూ.4 కోట్ల మినీ ట్యాంక్‌బండ్‌ కాంట్రాక్ట్‌ అంచనా వ్యయాన్ని అమాంతంగా రూ.40 కోట్లకు పెంచి అవినీతికి బిగాల పాల్పడ్డా డని ఆరోపించారు. కార్పొరేషన్‌లో 330 మంది పని చేయకున్నా.. చేసినట్లుగా రికార్డుల్లో చూయించి నెలకు రూ.50లక్షల వరకు దోచుకున్నాడని విమర్శించారు. స్రవంతిరెడ్డి, ప్రమోద్‌, జ్యోతి, రాజు, కి షన్‌, ప్రభాకర్‌, గిరిబాబు, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement