ప్రజాపాలనలో ప్రగతి పయనం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనలో ప్రగతి పయనం

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

ప్రయివేటుకు దీటుగా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.

బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య

– 8లో u

ప్రతిపాదనలను

సమర్పించాలి

నిజామాబాద్‌ అర్బన్‌ : గోదావరి పుష్కరాలను పురస్కరించుకొ ని చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించా లని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ మంగళవారం సమీక్షించారు. దేవాదాయ, నీటి పారుదల శాఖల ఆధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలను బుధవారంలోగా పంపించాలని, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ద్వారా కూడా రెండు రోజుల్లో సమగ్ర ప్రతిపాదన లు సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి ప్రాంతానికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కందకుర్తి పుష్కర ఘాట్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించాలని బోధన్‌ ఆర్డీవో విజయలక్ష్మిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఆర్వో గీత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌: నగరంలోని 11కేవీ పులాంగ్‌ ఫీడర్‌ లైన్‌ ఏబీ స్విచ్‌ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–3 ఏడీఈ వినోద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాస స్కూల్‌, రానా టవర్‌, ఆకాష్‌ అపార్ట్‌మెంట్స్‌, శివాలయం, రైతుబజార్‌, ఫాతిమా మ జీద్‌, మదీనా మజీద్‌, వేణు మాల్‌, వంశీ హోటల్‌, హైదరాబాద్‌ రోడ్‌, కాకతీయ స్కూ ల్‌, తదితర ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నామన్నారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ దుబ్బలో 11కేవీ గిరిరాజ్‌ కళాశాల ఫీడర్‌లో పనుల కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–2 ఏడీఈ ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌతంనగర్‌, దుబ్బ, రాజీవ్‌నగర్‌, గిరిరాజ్‌ కళాశాల ఏరియా, బైపాస్‌ రోడ్డులో నేడు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.

వడదెబ్బతో మహిళ మృతి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి (56) రోజు మాదిరి గా మంగళవారం కూలీ పనికి వెళ్లింది. పని చేసేచోట వడదెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయింది. కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వినాయక్‌నగర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి,

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య

ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు.

13వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్‌ పరేడ్‌ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టిందన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్‌ జిల్లా ముందంజలో నిలుస్తోందన్నారు.

2026 వానాకాలం సీజన్‌కు 5.58 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాలు 6,610 క్వింటాళ్లు, జనుము 126 క్వింటాళ్లు 50 శాతం రాయితీపై సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచమన్నారు. యూరియా 80,857 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 14,591, పొటాష్‌ 13,201, కాంప్లెక్స్‌ 45,122 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వేశామన్నారు. రైతులకు కొరత లేకుండా సరఫరా చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. మరణించిన 487 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా నామిని బ్యాంకు ఖాతాల్లో రూ. 24.35 కోట్లు నేరుగా జమ చేశామన్నారు. రైతు భరోసా కింద యాసంగి సీజనుకు గాను జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.219.16 కోట్లు జమ చేశామన్నారు.

జిల్లాలో మొదటి విడతలో 16,843 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 8,590 పురోగతిలో, మరో 8,253 ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇందుకు రూ.372.14 కోట్లు ఖర్చు చేశామన్నారు. తాజాగా 2,764 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేశామన్నారు.

మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 9.15 కోట్ల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో 2,97,635 కుటుంబాలకు ప్రతి నెలజీరో బిల్లులు జారీ చేసి రూ.260 కోట్లు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. నాయీబ్రాహ్మణ, రజక వృత్తుల లోని 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలోని 28 మండల సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం 28 బస్సులు మంజూరు చేసిందన్నారు. ఒక్కో బ స్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.10.8 కోట్లు తెలంగాణ ఆర్టీసీకి బదిలీ చేసిందన్నారు. ఇందులో 18 బస్సులను ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రారంభించామన్నారు.

సీ్త్రనిధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 761 సంఘాలకు రూ.16.75 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేశామన్నారు. రూ.3.56 లక్షల విలువైన 6 ఎలక్ట్రిక్‌ ఆటోలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. ఏప్రిల్‌ 2024 నుంచి జనవరి 2025 వరకు 20,109 సంఘాలకు రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ లింకేజి ద్వారా 96 స్వయం సహాయక సంఘాలకు రూ.11.8 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కోసం జిల్లాకు రూ.42.24 కోట్లు మంజూరు చేశామన్నారు. యంగ్‌ ఇండియా ఇంట్రిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పథకంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు చోట్ల (మల్కాపూర్‌, పొతంగల్‌, బెల్లాల్‌, అంకాపూర్‌) నిర్మాణ పనులను రూ.800 కోట్లతో ప్రారంభించామన్నారు.

భూ భారతి ద్వారా జిల్లాలో 70,790 దరఖాస్తులు రాగా, వీటిలో 69,212 పరిష్కరించామన్నారు. మిగిలిన 1,578 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయన్నారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ఆయన వివరించారు.

జిల్లాలో 4,01,959 పాత ఆహార భద్రత కార్డులు ఉండగా, ఈ ప్రభుత్వంలో కొత్తగా 71,370 కార్డులు మంజూరు చేశామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500లకే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను ఇస్తున్నాం. జిల్లాలో 2,47,603 మంది లబ్ధిదారులకు, 14,87,826 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి రూ.46.86 కోట్లు చెల్లించామన్నారు.

యాసంగిలో 7,03,550 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 98,157 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రూ.1,605 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు

సమ ప్రాధాన్యత

మరింత సమగ్రాభివృద్ధి కోసం

‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’

ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ

సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement