● ఎదుర్కొనేందుకు మరో
ఉద్యమం తప్పదు
● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ అస్తిత్వా న్ని, ఉనికిని కనుమరుగు చేసేందుకు కొన్ని శక్తులు ఐక్యంగా కుట్రలు పన్నుతున్నాయని, వీటిని ఎదు ర్కొనేందుకు మరోసారి పోరాటానికి సన్నద్ధం కా వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆంధ్రాకు వెళ్లి మహానాడు సభలో ‘డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు‘ అని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా ఎందుకు నిలదీయడంలేదన్నారు. ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ‘మా కోనసీమలో కొబ్బరికాయలు ఎండిపోతుంటే తెలంగాణోళ్ల దిష్టి తగిలింది‘ అని వెటకారం చేయడమేమిటన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో వీళ్లందరూ మొరుగుతున్నారన్నారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఎ లాంటి హింస కు తావులేకుండా ప్రజాస్వామ్య ప్ర క్రియ ద్వారానే తెలంగాణను సాధించిపెట్టారన్నా రు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియాగాంధీని ‘వేయి మంది బిడ్డలను బలిగొన్న బలిదేవత’ అన్న ఇదే రేవంత్ రెడ్డి, ఇవాళ సోనియా గాంధీ తెలంగా ణ ఇచ్చిందని మాయమాటలు చె బుతున్నార న్నారు. ఇందులో ఏది నిజమో రేవంత్ రెడ్డి స మా ధానం చెప్పాలన్నారు.నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఒక్కటై తెలంగాణ ఉనికే లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు.


